హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐడీఎల్‌ చెరువులో గణేష్‌ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

HYD: టీజీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి. పాటిల్‌ ఐడీఎల్‌ చెరువును సందర్శించి గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన పాయింట్ల వద్ద భద్రతా చర్యలు, విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. పండుగ సందర్భంగా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌, సిబ్బంది పాల్గొన్నారు.