JGL: మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద మురుగు కాలువ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల వ్యర్థ నీరు బయటకు వెళ్లే దారి లేక ప్రహరీ వద్దే నిలిచిపోతోంది. దుర్వాసన, దోమల బెడద పెరిగిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. వర్షాల్లో పరిస్థితి మరింత దిగజారుతుండటంతో వెంటనే కాలువ నిర్మించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: మురుగు కాలువలు లేక ఇబ్బందులు


