NZB: సిరికొండ మండలం కుర్థుల్‌పేట్ గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆలయంలోని పాత ఫ్లోరింగ్ దెబ్బతినడంతో గ్రామ ఉప సర్పంచ్ సతీష్ పటేల్ సొంత నిధులతో నూతన టైల్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. అలాగే దేవతామూర్తుల కోసం నూతన గద్దెల నిర్మాణ పనులు చేపట్టారు. ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేలా పనులు కొనసాగుతున్నాయని ఉప సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
సొంత నిధులతో పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు!


