హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రాజెక్టు కాలువల్లో పెరిగిన తుంగగడ్డి

MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల్లో తుంగగడ్డి ఏపుగా పెరిగింది. దీంతో కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకం కలిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు సక్రమంగా అందకపోతే పంటలకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. అధికారులు స్పందించి తుంగగడ్డితో పాటు చెత్తా చెదారం తొలగించి నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా చూడాలన్నారు.