SRCL: బోయినపల్లి మండలం మిడ్‌మానేరు జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటల వరకు జలాశయంలో నీటిమట్టం 315.58 మీటర్లకు చేరగా, నీటి నిల్వ 21.711 టీఎంసీలుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 317.83 మీటర్ల వద్ద 27.12 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం 1,964 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 170 క్యూసెక్కుల నీటిని వివిధ అవసరాలకు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
మిడ్‌మానేరు జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం


