హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇంట్లో పాము.. సురక్షితంగా పట్టిన స్నేక్ క్యాచర్

సంగారెడ్డి మున్సిపాలిటీ తాళ్లపల్లిలో వినాయక చవితి పూజా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు మునిగి ఉండగా ఓ ఇంట్లోకి పాము చొరబడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక యువకులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన వచ్చి పామును పట్టుకుని గోనె సంచిలో బంధించి అడవిలో వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.