హైదరాబాద్: 28°C
వార్తలు

హిందీ దివస్.. అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నా మాతృభాష గుజరాతీ. కానీ దేశంలో ఎక్కడికి వెళ్లినా సామాన్యులతో నన్ను నేరుగా కనెక్ట్ చేసే భాష హిందీనే. స్వాతంత్య్రం తర్వాత దేశ నిర్మాణం, పరిపాలన, అభివృద్ధిలో అన్ని భారతీయ భాషలు కీలక పాత్ర పోషించాయి. జాతీయ ఐక్యత, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఇతర భాషలతో పాటు హిందీ ముందుంది' అని షా కొనియాడారు.