SRPT: రాబోయే వినాయక నిమజ్జన వేడుకలను దృష్టిలో ఉంచుకుని మట్టంపల్లి పోలీసులు ఇవాళ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. హుజూర్‌నగర్ నుంచి కృష్ణా నది మట్టంపల్లి బ్రిడ్జి వరకు మార్గంలోని గుంతలను ఆర్‌అండ్‌బీ అధికారులతో సమన్వయం చేసుకుని పూడ్చివేయించారు. భక్తులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
గణేష్ నిమజ్జనానికి రోడ్డు మరమ్మతులు: ఎస్సై


