హైదరాబాద్: 28°C
వార్తలు

'అంతా ఓకేనా?'.. బ్రిక్స్ సదస్సులో ఆసక్తికర ఘట్టం

బ్రిక్స్ సదస్సులో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ తన ప్రారంభోపన్యాసం చేస్తున్న సమయంలో.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కాస్త అసౌకర్యంగా కనిపించారు. అది గమనించిన మోదీ తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి.. 'అంతా ఓకేనా?' అని జిన్‌పింగ్ అనువాదకుడిని అడిగారు. జిన్‌పింగ్ తల ఊపి స్పందించాకే మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించిన వీడియో SMలో వైరల్‌గా మారింది.