AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. పల్నాడు జిల్లా కూటమి నాయకులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలు, విధివిధానాలు, అభ్యర్థుల ఖరారుపై నేతలతో చర్చించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
వార్తలు
అన్ని స్థానాల్లో కూటమి గెలవాలి: మంత్రి


