హైదరాబాద్: 28°C
వార్తలు

వీఐపీ కల్చర్‌కు దూరంగా.. రైలెక్కిన గవర్నర్‌

యూపీలోని ఛత్రపతి మహారాజ్ వర్సిటీలో నిర్వహించే ఏఐ మంథన్ 2.0 కార్యక్రమానికి హాజరయ్యేందుకు గవర్నర్ ఆనందీబెన్ రైలులో కాన్పూర్ సెంట్రల్‌కు చేరుకున్నారు. ఈ రైల్వే స్టేషన్‌లో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వినయ్ ఆమెకు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ కాగా.. ఆమె నిరాడంబరతను అందరు మెచ్చుకుంటున్నారు. ఈ సదస్సులో పలు రంగాల్లో ఏఐ వినియోగంపై చర్చించనున్నారు.