హైదరాబాద్: 28°C
వార్తలు

యువత వైఫల్యానికి విద్యావ్యవస్థే కారణం: రాహుల్

యువత వైఫల్యానికి ప్రస్తుత విద్యావ్యవస్థే కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ విద్యా వ్యవస్థ ఏ తరాన్నైతే ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటుందో, అదే తరం విఫలం చెందేలా చేస్తోందని మండిపడ్డారు. ఈ వ్యవస్థను మార్చాలంటే ప్రతి విద్యార్థి ఆవేదనను వినాలన్నారు. విద్యా వ్యవస్థపై ఎందుకు ఆశ కోల్పోవాల్సి వచ్చిందో తనకు చెప్పాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కోరారు.