హైదరాబాద్: 28°C
వార్తలు

వినాయక చవితి వేళ ఆర్టీసీ బాదుడు!

TG: వినాయక చవితి సందర్భంగా ప్రయాణికులపై ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తోందంటూ ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి హన్మకొండ వెళ్లే ఏసీ బస్సు టికెట్ సాధారణంగా రూ.410 ఉండగా, పండుగ సందర్భంగా రూ.570కి పెంచారని తెలిపారు. దీంతో ఒక్క టికెట్‌పై రూ.160 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పండుగ వేళ ప్రయాణికులపై భారం మోపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.