AP: కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. శనివారం వేకువజామున బాలకృష్ణుడి నిర్మాల్య దర్శనం చేసుకుని, తైలాభిషేకం, వాకచార్థు, శంఖాభిషేకం సేవల్లో పాల్గొన్నారు. అనంతరం గురువాయూర్ సమీపంలోని మామ్మియూర్ మహాదేవ ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న పవన్‌కు మలబార్ దేవస్థానం బోర్డు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
వార్తలు
గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కల్యాణ్


