హైదరాబాద్: 28°C
వార్తలు

'మోదీజీ.. ఒక్క ఫొటో ప్లీజ్‌'

ఢిల్లీ వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ సదస్సులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొన్న పలువురు విదేశీ ప్రతినిధులు.. ప్రధాని మోదీతో ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు. ప్రధాని నడుచుకుంటూ వస్తుండగా ఆయన వద్దకు చేరి.. 'సర్, ప్లీజ్.. మేం మీతో ఒక ఫొటో దిగొచ్చా?' అని అడిగారు. దానికి ప్రధాని చిరునవ్వుతో 'ఎస్.. కచ్చితంగా' అంటూ వారితో ఫొటో దిగారు.