నీలం రంగు దుస్తులు ధరించినంత మాత్రాన అంబేద్కరిస్టులు అవుతారా? అని బీఎస్పీ అధినేత్రి మాయవతి ప్రశ్నించారు. సభలు, స్టేజీలపై నీలం రంగుబట్టలు వాడినంతమత్రాన ఏ పార్టీ జాత్యాహంకార, విపరీత మనస్తత్వం మారదని సమాజ్ వాద్ పార్టీ(ఎస్పీ)ని ఉద్దేశించి విమర్శించారు. దళితుల మీద ప్రేమ ఉంటే ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ముందు తమ మనస్సుల్లో ఉన్న కుల వివక్షను శుభ్రం చేసుకోవాలని సూచించారు.
వార్తలు
ఎస్పీపై మాయవతి విమర్శలు


