హైదరాబాద్: 28°C
వార్తలు

అరుణాచల్‌లో అరుదైన హిమ మీనం

అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ జిల్లాలోని ఓ ఎత్తైన సరస్సులో అరుదైన హిమాలయ చేపను శాస్త్రవేత్తలు గుర్తించారు. సిప్రినిడి కుటుంబానికి చెందిన స్కిజోపిగాప్సిస్ వడెల్లి అనే అరుదైన చేపల జాతికి చెందినదని తెలిపారు. ఇవి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ జీవించగలవని చెప్పారు. ఈ చేప పైభాగాన ముదురు బూడిదరంగు లేదా ఆలివ్ రంగుతో.. కింది భాగాన లేత వెండిరంగు లేదా మీగడలాంటి తెల్లరంగుతో ఉంటుంది.