ప్రపంచంలో బ్రిక్స్ కూటమికి ప్రాధాన్యత పెరుగుతోందని బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాల నుంచే వస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగానికిపైగా ఈ దేశాలదేనని స్పష్టం చేశారు. ఈ కూటమి ప్రపంచానికి దారి చూపిస్తోందని తెలిపారు. ఈ దేశాల్లో పట్టణీకరణ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.
వార్తలు
బ్రిక్స్ కూటమి ప్రపంచానికి దారి చూపిస్తోంది: పుతిన్


