హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: పసిడి ప్రియులకు షాక్

పసిడి ప్రియులకు మళ్లీ నిరాశే ఎదురైంది. రెండు రోజులుగా కాస్త శాంతించిన బంగారం ధరలు హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ మళ్లీ పెరిగాయి. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడిపై రూ.1,200 పెరిగి రూ.1,55,350కి చేరగా.. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,100 ఎగబాకి రూ.1,42,400కి చేరింది. మరోవైపు కిలో వెండి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అందుబాటులో ఉన్నాయి.