హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు చెట్టుకు ఢీకొని యువకుడు మృతి

JGL: జగిత్యాల రూరల్ మండలం కల్లెడ సమీపంలో సోమవారం కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో శివరాత్రి మహేశ్‌ (23) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మహేశ్వరి, సురేందర్, వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై ఉమాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.