హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

GDWL: పంట నష్టపోయి అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇమాంపురం గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పరుశరాముడు 8 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని మద్దతు ధర రాక రూ.5లక్షల వరకు నష్టపోయారు. రెండేళ్లుగా పంట పెట్టుబడికి రూ.10లక్షల వరకు అప్పు కావడంతో తీర్చలేననే మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.