HNK: భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్ గుట్టపై సహజసిద్ధమైన బండరాయి గుహలో కొలువైన లక్కాకులమ్మ జాతర ఈ నెల 9 నుంచి మూడు రోజులపాటు జరగనుంది. అమ్మవారిని వేడుకుంటే సంతాన భాగ్యంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనుండగా, పరిసర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ
9 నుంచి లక్కాకులమ్మ జాతర


