హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

HNK: పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలపై సమీక్షించారు. పూర్తయిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించి నివేదికలు పంపాలని సూచించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా అధికారులు పర్యవేక్షించాలని కోరారు.