హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అనుమతి ఉన్న ట్రాక్టర్లలోనే ఇసుక లోడ్ చేయాలి'

BHPL: అనుమతి పత్రాలు ఉన్న ట్రాక్టర్లలోనే ఇసుక లోడ్ చేయాలని SI పోచంపల్లి సతీశ్‌ సూచించారు. సోమవారం చిట్యాల మండలం కాల్వపల్లి శివారు మానేరు వాగులోని ఇసుక లోడింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించి కూలీలకు పలు సూచనలు చేశారు. ఇసుక లోడింగ్‌ ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకే నిర్వహించాలని, రూ.800కు మించి కూలీ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.