హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ మట్టి తరలింపు.. 7 ట్రాక్టర్లు, జేసీబీ పట్టివేత

HNK: కమలాపూర్ (M)లోని నేరెళ్ల శివారులో అక్రమంగా మట్టి తవ్వకాలు, తరలింపుపై పోలీసులు సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 7 ట్రాక్టర్లు, ఓ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన డ్రైవర్లు, యజమానులు కలిపి 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు SI దిలీప్ తెలిపారు. అక్రమంగా మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.