ADB: ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల కోసం యూడీఐడీ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం తెలియజేశారు. సెప్టెంబర్ 2026లో దరఖాస్తు చేసుకున్న వారికి రిమ్స్ ఆధ్వర్యంలో షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. సదరం సర్టిఫికెట్ ఉన్నవారు కూడా వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
తెలంగాణ
దివ్యాంగులకు UDID కార్డుల ప్రత్యేక శిబిరాలు: కలెక్టర్


