హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ మండపాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

SRCL: జిల్లాలో గణేష్ మండపాల ఏర్పాటు, భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ చేపట్టినట్లు ఎస్పీ మహేశ్ బి. గితే తెలిపారు. నిర్వాహకులు పోలీస్ శాఖ పోర్టల్‌లో ఉచితంగా మండప వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. విగ్రహం ఏర్పాటు చేసే ముందే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. బందోబస్తు ఏర్పాట్లకు పోలీసులను సహకరించాలన్నారు.