హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగుల మందు తాగి యువకుడి మృతి

JN: జఫర్‌గఢ్‌ మండలం సాగరం గ్రామంలో పురుగు మందు తాగి ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన పిన్నింటి సందీప్‌ (27) మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. మద్యం సేవిస్తున్న కుమారుడిని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన సందీప్‌ ఆదివారం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.