WGL: ఖానాపురం మండల కేంద్రంలో యాప్‌లో యూరియా బుక్ కావడం లేదని సోమవారం రైతు వేదికలో ఏవో శ్రీనివాస్, ఏఈవో ఆశాదీప్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. పంటలకు ఎరువులు వేసే సమయం దాటిపోతోందని, వెంటనే యూరియా అందకపోతే దిగుబడి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్‌లో నమోదు చేసుకుంటేనే యూరియా అందిస్తామని అధికారులు చెప్పడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు.
తెలంగాణ
యూరియా బుక్ అవ్వడం లేదని ఆందోళన


