హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూదాన్ పోచంపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా..!

BHNG: అసెంబ్లీలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌పై పోలీసులు నిరంకుశంగా దాడి చేసి అక్రమ అరెస్టు చేయ‌డాన్ని నిరసిస్తూ భూదాన్ పోచంపల్లిలో సోమవారం నేతాజీ ప్రధాన చౌరస్తా వద్ద ఆ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.