KNR: హుజూరాబాద్ 19వ వార్డు పోచమ్మవాడలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిన లబ్ధిదారు జావాజి శైలజ ఇంటి నిర్మాణానికి కౌన్సిలర్ రాజ్‌కుమార్ ముగ్గు పోసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరమని అన్నారు.
తెలంగాణ
పోచమ్మవాడలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం


