హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్ఈగా విజయేందర్‌రెడ్డి

KNR: కరీంనగర్ టీజీఎన్‌పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈగా ఎ. విజయేందర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ఎస్ఈగా నియమిస్తూ సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండలో డీఈగా పనిచేసిన ఆయన బదిలీపై కరీంనగర్‌కు వచ్చారు. అధికారులు, సిబ్బంది ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.