హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ నంబర్ ప్లేట్లపై ఉక్కుపాదం

HYD: నగరంలో నకిలీ, ట్యాంపర్‌ చేసిన నంబర్‌ ప్లేట్లపై ట్రాఫిక్‌ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గతవారం ఏడు క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిర్దేశిత HSRP నంబర్‌ ప్లేట్లు వినియోగించాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు తప్పవని హెచ్చరించారు.