హైదరాబాద్: 28°C
తెలంగాణ

కత్తితో దాడి.. వ్యక్తికి రిమాండ్

SDPT: మద్దూరు మండలం మహారాజ్ తండాలో భూ, దారి వివాదంతో అన్న కుమారుడు రాజేష్‌పై కత్తితో దాడి చేసిన సభావత్ దేవేందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 1న జరిగిన ఈ దాడిలో రాజేష్ తలకు తీవ్ర గాయమైంది. బాధితుడి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు, దేవేందర్‌ను సోమవారం చేర్యాల మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు.