హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కుప్టి వంతెన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి'

ADB: నేరడిగొండ మండలం కుప్టి వద్ద 4-లేన్ హైవే ప్రమాదకర మలుపు, దెబ్బతిన్న పాత వంతెన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సామాజిక కార్యకర్త సంతోష్ సింగ్ అన్నారు. ఈ మేరకు MPDO గంగా సాగర్ రెడ్డిని సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. పాత వంతెన దెబ్బతినడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని, కొత్త వంతెన నిర్మాణంతో పాటు తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.