హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి విత్తనాల పంటలను పరిశీలించిన ఏవో

KMM: కుసుమంచి మండలం తురకగూడెంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అందించిన పత్తి విత్తనాల పంటలను ఏవో రామడుగు వాణి సోమవారం పరిశీలించారు. పత్తి పంటలో రసం పీల్చే పురుగుల నియంత్రణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. కపాస్ కిసాన్ పథకం ద్వారా 100 శాతం రాయితీపై పత్తి విత్తనాలు పొందిన రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన ఆమె పంట పరిస్థితిపై ఆరా తీశారు.