హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఊరేగింపుల్లో డీజేలు ఉపయోగిస్తే సీజ్'

KMM: వినాయక ఉత్సవాల నిర్వాహకులతో సోమవారం వైరా ఎస్సై రామారావు సమీక్ష నిర్వహించారు. వినాయక మండపాలు, ఊరేగింపుల్లో డీజేలు ఉపయోగిస్తే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గణేష్ చవితి ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. తహసీల్దార్ ఎదుట 6 నెలల బైండ్ ఓవర్ చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించారు.