హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఉషారాణి

HYD: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.ఉషారాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆ పోస్టులో కొనసాగిన డా.వాణి డీఎంఈగా పదోన్నతిపై వెళ్లడంతో సూపరింటెండెంట్ పోస్టు సుమారు నెల రోజులు ఖాళీగా ఉంది. దీంతో ప్రభుత్వం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆమెను నియమించారు.