హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి : CP

PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, ప్రతి ఒక్కరి సమస్యను స్వయంగా తెలుసుకున్నారు. ఫిర్యాదులను పారదర్శకంగా, త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నేరుగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.