హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి కేసులో యువకుడి అరెస్టు

MNCL: గంజాయి కేసులో యువకుడిని అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి 1 టౌన్ సీఐ కె. శ్రీనివాసరావు తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్ పై వస్తున్న మాస ప్రకాష్ వద్ద 200 గ్రాముల గంజాయి లభించింది. బల్లార్షాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి బైక్, గంజాయి స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేశారు.