ADB: వార్షిక తనిఖీల్లో భాగంగా గాదిగూడ పోలీస్ స్టేషన్‌ను ASP రుత్విక్ సాయి కొట్టే పరిశీలించారు. సిబ్బంది పరేడ్, వాహనాలు, రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, గ్రామాలను సందర్శించి ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని, గంజాయి, గుడుంబా నియంత్రణకు చర్యలు చేపట్టాలని అన్నారు.
తెలంగాణ
గాదిగూడ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన: ASP


