హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడ ఏరియా పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏఈ వినోద్ తెలిపారు. టీ-43 ట్రాన్స్ ఫార్మర్ పరిధిలోని విద్యుత్ లైన్‌లలో అత్యవసర మరమ్మతు పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వెల్లడించారు. వినియోగదారులు సహకారించాలని కోరారు.