కడప జిల్లా కలసపాడు PHCని ఇవాళ సాయంత్రం డిప్యూటీ DMHO మల్లేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛంధ్ర’ అవార్డుల పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. బయోమెడికల్ వ్యర్థాలు వేరు చేయడం, ఆసుపత్రి పరిశుభ్రత, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు శైలజ, సాయి తేజ, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీహెచ్‌సీని తనిఖీ చేసిన డిప్యూటీ DMHO


