హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: క్రీడాకారిణికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

VSP: చైనాలో జరిగే అండర్-17 అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన దంతులూరి విజయ తేజస్వినికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో క్రీడాకారిణి తల్లికి ఆయన ఈ నగదును అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులను ఆదుకోవడంలో తామెప్పుడూ ముందుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.