హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దవరం స్మశాన భూమిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు

NTR: పెద్దవరం గ్రామంలో ఎస్సీ మాదిగ కుటుంబాలు స్మశాన భూమి కొరత, ఆక్రమణపై నందిగామ తహసీల్దార్‌కు అర్జీ సమర్పించారు. ప్రస్తుతం 36 సెంట్ల స్మశానం నిండిపోవడంతో, మృతదేహాలను పూడ్చడానికి స్థలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 12 35 ప్రకారం రెండు ఎకరాల అదనపు భూమి, ఆక్రమణకు గురైన 35 సెంట్ల భూమిని తిరిగి కేటాయించి, ప్రహరీ గోడ, షెడ్డు నిర్మించాలని కోరారు.