హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రికార్డు స్థాయిలో 179 ఫిర్యాదులు

ASR: కొయ్యూరు మండలంలోని ఆడాకుల సచివాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి రికార్డు స్థాయిలో 179 ఫిర్యాదులు అందాయని ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలపైనే 178 ఫిర్యాదులు అందాయని చెప్పారు. విద్యుత్ సమస్యపై మరో ఫిర్యాదు అందిందన్నారు. ఇందులో ఎస్ఎంఐ జేఈ రామకృష్ణ అధికారులు పాల్గొన్నారు.