హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన పోషకాహార వారోత్సవాలు

VSP: ఆంధ్ర మెడికల్ కాలేజ్, కేజీహెచ్ పిల్లల వైద్య విభాగం, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ పోషకాహార వారోత్సవాలు సోమవారం ముగిశాయి. వారం రోజుల పాటు విద్యార్థులు, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిశు పోషకాహారం, అనుబంధ ఆహారం, పోషకాహార లోపాల నివారణపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి పాల్గొన్నారు .