హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దపోర్లకు బస్సు సౌకర్యం

NRPT: మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో పెద్దపోర్ల గ్రామ ప్రజల 20 ఏళ్ల కల సాకారమైందని గ్రామ సర్పంచ్ కాశమ్మ అన్నారు. సోమవారం ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామానికి బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. గత 20 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చిందన్నారు.