హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప ఎస్పీ PGRSకు 153 ఫిర్యాదులు

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ప్రజల నుంచి 153 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను చట్టపరిధిలో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి వినతులు స్వీకరించిన ఎస్పీ, బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.