హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీధి దీపాలు వెలగక ఇబ్బందులు

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1లోని ఎస్సీ కాలనీలో గత 20 రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు తెలిపారు. పార్వతీపురం, వెంకటేశ్వరాపురం, తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. రాత్రివేళల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలను మరమ్మతు చేయాలని కోరారు.